ఆలమూరు, : డా. బీఆర
Also read ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని వైకాపా నాయకుడికి చెందిన ఒక ఇటుక బట్టీలో రూ.7.8 లక్షల విలువైన గోవా మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పెనికేరు రహదారిపై ఉన్న ఈ బట్టీలో మద్యం సీసాలున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో ఎస్ఈబీ అధికారులు దాడి చేశారు. స్థానిక వైకాపా నాయకుడు, ప్రస్తుతం మండపేట వైకాపా ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న సీహెచ్ ప్రభాకరరావు ఈ బట్టీ యజమాని. మొత్తం 130 బాక్సుల్లో ఉన్న 6,240 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్సై సత్యవాణి తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అమర్బాబు, రాజోలు సీఐ పి. శ్రీనివాస్, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యురాలు పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.
- రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
- రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
- మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే
- ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మీన రాశి ఫలితాలు!
- 2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !





