ఆ ఇద్దరి మధ్య స్నేహం బీటలు వారింది. దీంతో విడిపోయి.. ఎవరి బిజినెస్ వారు చేసుకుంటున్నారు. కానీ ఓ రోజు అర్థరాత్రి తన ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు మరో స్నేహితుడు. భార్య ఉండగానే…
ఇద్దరు స్నేహితులు కలిసి ఓ దందా మొదలు పెట్టారు. అయితే కొన్ని వివాదాలు ఇద్దరు విడిపోయేలా చేశాయి. ఎవరి దారులు వారు వెళుతున్నారు. కానీ ఫ్రెండ్ పై ఎక్కడో ఈర్ష, ద్వేషాలతో రగిలిపోయాడు మరో స్నేహితుడు. అయితే ఓ రోజు అర్థరాత్రి ఊరంతా నిద్రపోతున్న వేళ.. ఓ ఇంట్లోకి కొంత మంది దుండగులు, కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. భార్య కళ్లెదుటే భర్తను అత్యంత కిరాతకంగా చంపేశారు. అనంతరం దుండగులు పారిపోవడంతో భార్య కేకలు వేసింది. చుట్టు ప్రక్కల జనాలు వచ్చి.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. భూ దందా విషయంలో ఈ దారుణం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లిలోని శ్రీవారి నగర్లో ఉంటున్న పుంగనూరు శేషాద్రిని కొంత మంది దుండగులు హత్య చేశారు. భార్య ఎదుటే భర్తను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శేషాద్రి అలియాస్ శేషు .. ఆనంద్ స్నేహితులు. శేషు.. కార్ డ్రైవింగ్ చేస్తుండేవాడు. కోల్ కతాకు డ్రైవింగ్‌కు వెళ్లేవాడు. అక్కడ పరిచమైన కమలను రెండో వివాహం చేసుకున్నాడు. రెడ్డమ్మ అనే కుమార్తె కూడా ఉంది. ఇక ఆనంద్, శేషు కలిసి సెటిల్ మెంట్, భూదందా చేసేవారు. ఈ నేపథ్యంలో గతంలో ఆనంద్, శేషులపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆనంద్ జట్టు వీడి.. శేషు మాత్రమే భూదందా చేసుకుంటున్నాడు.
దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. ఈ నెల 24న అర్థరాత్రి.. ఆనంద్ తన అనుచరులతో కలిసి.. శేషు ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలి రా అంటూ మిద్దెపైకి తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆనంద్ అనుచరులు కత్తి దూయడంతో తప్పించుకుని ఇంటిలోకి వచ్చేసి తలుపులు వేసుకున్నాడు శేషు. అయినప్పటికీ ఆగలేదు ఆనంద్, అతడి అనుచరులు. తలుపులు పగుల గొట్టి.. కమలను అరవకుండా ఆమె గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అనంతరం శేషును విచక్షణా రహితంగా ఆమె కళ్ల ముందే నరికేశారు. అక్కడి నుండి ఆనంద్, అతడి అనుచరులు వెళ్లిపోయిన తర్వాత కేకలు వేసింది కమల. వెంటనే స్థానికులు వచ్చి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని పనిలో పడ్డారు. కాగా, భార్య కళ్లెదుటే భర్త మరణించడంతో భార్య తీవ్ర షాక్‌లో ఉంది.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్‌గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





