రామచంద్రపురం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోమండనం కేసు విచారణ 16కు వాయిదా పడింది. ఈ కేసులో ఇ ప్పటి కే పూర్తయిన సందర్భంగా ఈనెల 12న తుది తీర్పు వెలువరిస్తామని విశాఖ లోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల వెల్లడించింది. 28 ఏళ్లుగా దళితులు ఈ కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడుతుందని ఎదురు చూశారు. అయితే ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శుక్రవారం సెలవు పై వెళ్లడంతో ఈ కేసును ఈ నెల 16 కు వాయిదా వేశారు. 16 వచ్చే తీర్పు కోసం దళితులు ఎదురుచూస్తుండగా మరోవైపు ఇందులో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఈ తీర్పు కీలకం కానుంది.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





