గాజువాక (విశాఖ) : ఖాళీ స్థలం విషయంలో వైసిపి నాయకుడికి, స్థానిక మహిళకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైసిపి నేత సదరు మహిళను మంటల్లోకి నెట్టేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖ గాజువాకలో జరిగింది.
న్యూపోర్టు సిఐ దాలిబాబు తెలిపిన వివరాల ప్రకారం … గాజువాక 65వ వార్డు బానోజితోటలో రాధ (35) నివాసం ఉంటోంది. ఆమె ఇంటి పక్కన కొంత ఖాళీ స్థలం ఉండగా.. శుక్రవారం వైసిపి నాయకుడు లోకనాథం అక్కడ చెట్లు నరికి అగ్గి పెట్టాడు. దీంతో రాధ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ స్థలం తనదని.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ అతడిని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో లోకనాథం ఆమెపై చేయి చేసుకున్నాడు. చెట్టు కాలుతున్న మంటల్లోకి తోసేయడంతో ఆమె చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రాధ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. మరోవైపు లోకనాథం తాను ఆ సమయంలో సంఘటనా స్థలంలో లేనని చెబుతున్నాడు. కొద్దిరోజులుగా ఆమె తనపై కక్ష పెట్టుకుని ఫిర్యాదు చేస్తోందని ఆరోపించాడు. దీనిపై సీఐను సంప్రదించగా.. ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టినట్లు చెప్పారు. ఖాళీ స్థలంపై గత కొన్నాళ్లుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





