విశాఖపట్నం…ఎంవిపి కాలనీ : తమ పార్టీ కి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్టు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీ లో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ కి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హై కోర్టు న్యాయ మూర్తులకు ధన్య వాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతామన్నారు. ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిపారు. గ్లాసులు పగిలి పోయాయి. సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు. కోర్టులో కేసు వేసి కుండ గుర్తు సాధించాను అన్నారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీలు ద్వారా ఉపాధి కల్పిస్తాం అన్నారు. ప్రజలు మోడీ, కేసీఆర్, జగన్ కు అవకాశం ఇచ్చారు. ప్రజా శాంతి పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రానీ వారు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారు. రుషి కొండలో కొండ మాయం చేశారు. కుటుంబ, కుల పాలనకు చరమ గీతం పాడాలి అన్నారు. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారు. కంపెనీలు అహ్మదాబాద్ తరలి పోతున్నాయి. ఆధ్యాత్మిక, డిల్లీ, ప్రజల బటన్లు తన వద్ద వున్నాయి అన్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబం అక్కడ దోచుకుని ఇప్పుడు విశాఖ వచ్చారు అని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసు పాదం, శుభాకర్, బాబు రావు, జిలు కర రవి కుమార్, బాబుజీ రావు, పాల్గొన్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





