*భాష్యం పాఠశాలలో ఘనంగా జరిగిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు* భాష్యం పాఠశాలలో ది:08.04.24-సోమవారం నాడు ముందస్తు ఉగాది వేడుకలను విద్యార్థులు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారని ప్రిన్సిపల్ శ్రీ ఎన్ వి అప్పారావు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా సాంప్రదాయ దుస్తులలో ఆడి పాడి అలరించారు.
ఉగాది అంటేనే అందరికీ గుర్తొచ్చేది వేప పూత మామిడి పిందెలు కోయిల కుహు కుహులు. విద్యార్థులంతా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి వేప చెట్టు నుండి వేపపూతను మామిడి కాయలను సేకరిస్తూ అల్లరి చేశారు. అనంతరం షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని అందరూ కలిసి ఆరగించి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన హాస్యపు అల్లరి అంతా ఇంతా కాదు. ప్రిన్సిపల్ శ్రీ ఎన్ వి అప్పారావు గారు మాట్లాడుతూ ప్రకృతిని పులకరింప చేసేదే చైత్రం ఈ చైత్రమాసంలోని ఉగాది పండుగ మన అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహం నింపుతూ షడ్రుచుల సమ్మేళనంలా మనందరి జీవితం అర్థవంతంగా అనుభవాల సారాలతో బంధాలు పదిలంగా కలకాలం ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక అంటూ ఉగాది పండుగ ఉగాది పచ్చడి విశిష్టతను విద్యార్థులకు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం జోనల్ ఇన్చార్జ్ శ్రీ శ్రీమన్నారాయణ రెడ్డి గారు చాంప్స్ ఇంచార్జ్ శ్రీమతి రాణి రోజాజీ గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం