పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్. హబీబ్‌నగర్‌లో అతడిపై కేసు నమోదైంది. ప్రస్తుతం మిర్‌చౌక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గోపి, ఆ అమ్మాయి ఒకే ప్రాంతానికి చెందిన వారు. కొన్ని నెలల క్రితం ఓ కార్యక్రమంలో బాలికను గోపి కలిశాడు. ఆమెతో మాటలు కలిపాడు. తక్కువ సమయంలోనే వారిద్దరూ స్నేహితులయ్యారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. గోపి ఆమెకు పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. అయితే, బాధితురాలు ఇటీవల పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీయడంతో.. అతను పెళ్లికి నిరాకరించాడు. ఆమెతో మాట్లాడడం తగ్గించేశాడు.. తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. మోసపోయానని భావించిన బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హబీబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





