ఏసీబీ వలలో ఓ అవినీతి తిమిగళం చిక్కింది. హైదరాబాద్ నాంపల్లిలోని పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ సంచాలకుల కార్యాలయంలో పి. జగన్ మోహన్ ఉప సంచాలకుడిగా పని చేస్తున్నాడు. 50వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం, చెలిమెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి జితేందర్ రెడ్డి.. తన తండ్రి జ్ఞాపకార్థం స్వగ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు DTCEP లే అవుట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అన్ని నిబంధనలకు లోబడి కడుతున్నా.. పర్మిషన్ ఇవ్వకుండా డిప్యూటీ డైరెక్టర్ జగన్ మోహన్ రూ. 90వేలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. పలు మార్లు కార్యాలయం చుట్టూ బాధితుడు తిరిగి రూ. 50వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. డబ్బులు ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని లేకుంటే ఇవ్వను అనడంతో.. బాధితుడు జితేందర్ రెడ్డి ఏసిబిని ఆశ్రయించినట్లు తెలిపాడు. అవినీతి అధికారిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు ఏసీబీ అధికారులు. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అవినీతి అధికారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అలాగే రెండు బృందాలు అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు