Viral Video : ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ఇంటా, బయటా ఎక్కడా సేఫ్టీ లేకుండా పోయింది. ఎప్పుడు ఎటువైపు నుంచి మృగాళ్లు మీద పడతారో తెలియని పరిస్థితి. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి.. తిరిగి క్షేమంగా ఇంటికి చేరేవరకు వారి తల్లిదండ్రులు ఆందోళన పడుతూనే ఉంటారు. పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు నిత్యం కంగారు పడే రోజులు తయారయ్యాయి. ఎక్కడ చూసినా ఆఢపిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక దాడులకు తెగబడటం.. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి.
తాజాగా ఓ స్కూల్ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ బాలికను ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ అమ్మాయి బుగ్గపై కొరికాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్తోంది. ఇంతలో దారిలో ఊహించని ఘటన జరిగింది. బాలికను ఫాలో అవుతూ వచ్చాడో ఓ యువకుడు. ఆమె వెనకాల పరిగెతూ వచ్చాడు. సడెన్ గా బాలికను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత బుగ్గపై ముద్దు పెట్టాడు. బుగ్గను కొరికాడు కూడా. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతడి చర్యతో బాలిక బాగా భయపడిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ ఏడ్చేసింది. యువకుడు బాలికను ఫాలో కావడం, బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ షాకింగ్ ఘటన బంగ్లాదేశ్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాగా, అతడి మానసిక స్థితి బాగోలేదని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అతడికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
ఏది ఏమైనా ఆడపిల్లకు రక్షణ కరువు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయి
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!