ఆదిలాబాద్ : వావివరసలు మరిచి సొంత చెల్లిపైనే ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ లొ వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాలు…. మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక(16) తల్లి మృతి చెందడంతో కొన్నేళ్లుగా తండ్రి, తమ్ముడు, అన్నతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ఒక కాలనీలో నివాసముంటోంది. తొమ్మిదో తరగతి వరకు చదివి మానేసిన ఆమె ఇంటివద్దనే ఉంటోంది. డ్రైవర్ గా పనిచేసే అన్నయ్య నెల రోజులుగా ఆమెను భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ అతడు భయపెట్టడంతో ఆమె ఇన్నాళ్లూ ఎవరికీ చెప్పకుండా మానసికంగా కుమిలిపోయింది. ఈ క్రమంలో మంగళవారం బాలిక పోలీసుస్టేషన్ కు వచ్చి విలపిస్తూ విషయం చెప్పటంతో పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించి భరోసా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు.
Also read
- గణాధిప సంకష్టి చతుర్థి ఎప్పుడు? చంద్రోదయం, ఉపవాస నియమాలు.. ఏం తినాలి? ఏం తినకూడదు?
- కార్తీక మాసాన్ని దామోదర మాసం అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడి అద్భుత లీల వెనుక కథ ఇదే!
- కార్తీక పురాణం 18వ రోజు
- కార్తీక పురాణం 17వ రోజు
- కుబేర యోగంతో అదృష్టం కలిసి వచ్చే రాశులివే





