SGSTV NEWS online
CrimeTelangana

ధాన్యం రాశిపై ఆగిన రైతు గుండె



పర్వతగిరి (వరంగల్): ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం రాశిపైనే ఓ రైతు గుండె ఆగింది. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమళ్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం… బూర్గుమళ్లకు చెందిన రైతు నాళ్లం వీరస్వామి(60) తనకున్న మూడెకరాల భూమిలో వరి వేశారు. 15 రోజుల క్రితం పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రోజూ ఆరబోస్తున్నారు. మంగళవారం సాయంత్రం వర్షం పడేలా ఉండటంతో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పగా పోశారు. ఈ క్రమంలో ఛాతీలో నొప్పి వస్తోందంటూ.. వడ్ల రాశి పక్కనే కుప్పకూలి కన్నుమూశారు. అతనికి భార్య బుచ్చమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Also read

Related posts