నందికొట్కూరు, కొత్తపల్లి, : ఆ తల్లి.. నవమాసాలు మోసి బాలుడికి జన్మనిచ్చింది. అల్లారుముద్దుగా పెంచింది. పిల్లలే సర్వస్వమై జీవిస్తోంది. కానీ అనుకోని ప్రమాదంలో కళ్లముందే చిన్నారి అగ్నికి ఆహుతవుతుంటే తల్లడిల్లిపోయింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం పంచాయతీ పరిధిలోని బలపాలతిప్పలో పూరింటికి నిప్పంటుకుని ధర్మతేజ (5) అనే బాలుడు సజీవ దహనమైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కాట్రాజు ఈరన్న, భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు తన తాత వెంట బయటికెళ్లాడు. తండ్రి పొలం పనులకు వెళ్లగా తల్లి ఇంటి బయట దుస్తులు ఉతుకుతోంది. రెండో కుమారుడు ధర్మతేజ ఇంట్లో నిద్రిస్తున్నాడు. పూరింటికి ఏర్పాటుచేసిన సోలార్ ప్యానెల్ బ్యాటరీ పేలిపోవటంతో మంటలు అలుముకున్నాయి. తల్లి భారతమ్మ, స్థానికులు ధర్మతేజను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈక్రమంలో బాలుడు కాలిబూడిదయ్యాడు. తన బిడ్డను కాపాడాలంటూ తల్లి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కలిచివేశాయి. బియ్యం, ఇతర వస్తువుల రూపేణా సుమారు రూ. లక్ష ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి తహసీల్దారు ఉషారాణి రూ.5వేలు అందజేశారు.
Also read
- ఘరానా మోసం.. జ్యోతిష్యుడి నుంచి రూ.70 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలిస్తే..
- రైలులో బాలికల అక్రమ రవాణా
- జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్
- అనుమానంతో దారుణం.. ప్రియురాలికి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మహిళ మృతి
- ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానం.. 16 ఏళ్ల బాలికను హత్య చేసిన యువకుడు!





