SGSTV NEWS online
CrimeTelangana

డాక్టర్‌ పద్మజకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు



హైదరాబాద్‌: మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించి రవాణా చేసిన వ్యవహారంలో డాక్టర్‌ పద్మజకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని హైకోర్టును పోలీసులు కోరారు. ఈ కేసుల్లో ఆమెను ఇప్పటికే నిందితురాలిగా చేర్చామని.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కీలకమైన వైద్య, డిజిటల్‌ ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అభ్యంతరం తెలిపారు.

ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అండాల అక్రమ సేకరణకు సంబంధించి దాఖలైన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ డాక్టర్‌ పద్మజ హైకోర్టు పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను బ్రోకర్లు డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అండదాన ప్రక్రియలకు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని ప్రభుత్వ న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు వివరించారు. 

Also read

Related posts