హైదరాబాద్: ప్రేమ వ్యవహారం బ్రేకప్ కావడంతో
యువకుడిని భయపెట్టేందుకు.. షీ టీమ్స్ పేరుతో నకిలీ పోలీసు నోటీసు సృష్టించి వాట్సప్‌లో పంపిన యువతి, ఆమె స్నేహితుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఓ యువకుడికి హరి అనే వ్యక్తి.. షీ టీమ్స్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ వాట్సప్ ద్వారా నోటీసు పంపాడు. దీంతో బాధితుడు ఆ నోటీసుతో షీ టీమ్స్ ముందు విచారణకు వెళ్లాడు. అయితే.. నోటీసు నకిలీదని తేలడంతో షీ టీమ్స్ ఎస్ఐ వెంకటేశ్.. సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థిని (24).. ఆ యువకుడితో ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన యువకుడు ఏడాదిగా దూరంగా ఉంటూ.. సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న ఆమె ఏఐ సాయంతో షీ టీమ్స్ పేరుతో.. నకిలీ నోటీసు తయారు చేసి హరి ద్వారా పంపినట్లు వెల్లడైంది. సైఫాబాద్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- హైదరాబాద్ లొ దారుణం………! బధిరి మహిళపై అత్యాచారం…
- మైలవరం బస్టాండ్‌లో భారీ చోరీ.. ఐదుగురు మహిళల గుట్టు రట్టు!
- డాక్టర్ పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
- గర్ల్స్ హాస్టల్లోకి పురుషులు.. లోపల బాగోతం వేరే!
- మాజీ ప్రియుడిపై కోపం.. షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు





