SGSTV NEWS online
Andhra PradeshCrime

వేటకు పిలిచి.. వేటేశాడు!



శ్రీకాకుళం  : స్నేహితుని భార్యతో వివాహేతర సంబంధం.. స్నేహితుడినే దారుణంగా చంపేందు కు పురిగొల్పింది. తల మొండెం వేరు చేసి చంపేత కక్షను పెంచింది. లావేరు మండలం అప్పాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ యండ అసిరినాయుడు ఈ నెల 2న హత్యకు గురైన సంగతి విధిత మే. అసిరినాయుడుని హత్య చేసింది అదే మండలం వేణుగోపాలపురానికి చెందిన లండ ఆదినారాయణ అలియాస్‌ గౌరినాయుడుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి వివరాలను శ్రీకాకుళం సబ్‌డివిజనల్‌ కార్యాలయంలో డీఎస్పీ సీహెచ్‌ ధనుంజయనాయుడు ఆదివారం వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. 

అదృశ్య కేసుగా నమోదు.. 
తన భర్త అసిరినాయుడు ఈ నెల 2న సాయంత్రం 7 గంటలకు ద్విచక్రవాహనంపై సెంటర్‌కు వెళ్లి వస్తాన ని చెప్పి తిరిగి రాలేదని యండ మంజు ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం సమక్షంలోని నాలుగు బృందాలతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. రణస్థలం మండలం అర్జునవలస చెరువులో అసిరినాయుడుకు చెందిన ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. డ్రోన్‌ కెమెరాలు, అగి్నమాపక సిబ్బంది సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ అసిరినాయుడు ఆచూకీ లభ్యం కాలేదు.

సీసీ ఫుటేజీల ద్వారా వెలికి తీసి.. 
దీంతో అర్జునవలస నుంచి రణస్థలం, లావేరు హైవే పై సీసీ ఫుటేజీలు వెరిఫై చేసి అసిరినాయుడుతో చివరిసారిగా ద్విచక్రవాహనంపై వచ్చిందెవరన్నది పోలీసులు కనిపెట్టారు. ఆదినారాయణపై అనుమా నం వచ్చి ఫోన్‌ సంభాషణలను విని ఓ కొలిక్కి వచ్చి ఆ దిశగా విచారణ చేశారు. ఐదేళ్ల కిందట అసిరినాయుడుకు పరిచయమైన ఆదినారాయణ స్నేహం ఏర్పరచుకుని అప్పుడప్పుడూ వేటకు వెళ్లేవారు. ఆ క్రమంలో అసిరినాయుడు భార్యతో ఆదినారాయణ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలుసుకున్న అసిరినాయుడు మంజును కొట్టడం ఆరంభించడంతో ఎక్కడ మంజును చంపేస్తాడేమోనని ఆదినారాయణ అసిరినాయుడిని చంపేద్దామని నిశ్చయించుకున్నాడు.

వేటకు పిలిచి..
ఈ నెల 2న వేటకు వెళ్దామని అసిరినాయుడిని పిలిచిన ఆదినారాయణ నాటుతుపాకీ, కత్తి వెంట తీసుకెళ్లాడు. అప్పాపురానికి 8 కిలోమీటర్ల దూరంలోనున్న తాళ్లవలస గ్రామ సమీపానికి చేరుకునేసరికి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీయగా ఆదినారాయణ తనవద్దనున్న నాటు తుపాకీతో అసిరినాయుడు వీపు వెనుక భాగంలో కాల్చగా కిందపడిపోయాడు. వెంటనే కత్తితో తలను మొండెం నుంచి వేరు చేసి హత్య చేశాడు. సమీపంలోనే పాడు బడిన బావిలో మృతదేహాన్ని పడేసి అక్కడికి అరకిలోమీటరు దూరంలో తల భాగాన్ని తాటిచెట్ల మధ్య పూడ్చి పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా అసిరినాయుడు ద్విచక్రవాహనాన్ని 15 కిలోమీటర్ల దూరంలోనున్న రణస్థలం మండలం అర్జున వలస చెరువులో పడేశాడు. హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీ, కత్తిని తాళ్లవలస లేఅవుట్‌ ప్రాంతంలో దాచి పెట్టి విశాఖ వెళ్లిపోయాడు

ఆయుధాలను వెతికే క్రమంలో పట్టుబడి.. 
దాచిపెట్టిన ఆయుధాలను తీసుకెళ్లేందుకు వచ్చిన నిందితుడు ఆదినారాయణను  బొడ్డపాడు వెళ్లే మా ర్గంలో పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. నింది తుని వద్ద మారణాయుధాలను స్వా«దీనం చేసుకుని ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐలు వి.సంబదీప్, హేమంత్‌కుమార్, సిబ్బంది ఎస్‌.రవికుమార్, సిహెచ్‌ చక్రదర్, ఎస్‌.వెంకటరావు, కె.లక్ష్మణరావులను ఎస్పీ అభినందించారు.

Also read

Related posts