SGSTV NEWS online
Spiritual

విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రబోధిని ఏకాదశి.. చెరకు మండపం, ఈ 3 నైవేద్యాల వెనుక ఉన్న రహస్యం తెలుసా?


నవంబర్ 20న దేవుతాని ఏకాదశిని జరుపుకోనున్నారు. ఈ రోజున చెరకుతో మండపం ఎందుకు ఏర్పాటు చేస్తారు? సింగాడా, చిలగడదుంప, ఉసిరి, రేగి పండ్లను నైవేద్యంగా సమర్పించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సంప్రదాయ ప్రాధాన్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

హిందూ ధర్మంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని.. దేవఉత్థాన ఏకాదశి / ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు. నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ రోజున మేల్కొంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ పర్వదినం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు మళ్లీ శ్రీకారం చుడతారు. 2026లో ని నవంబర్ 20న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు.


2026 శుభ సమయాలు

2026 నవంబర్ 20న ఉదయం 7:15 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై, నవంబర్ 21న ఉదయం 6:31 గంటలకు ముగుస్తుంది. స్మార్త, గృహస్త సంప్రదాయం ప్రకారం నవంబర్ 20న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. నవంబర్ 21న మధ్యాహ్నం 1:11 నుంచి 3:18 గంటల మధ్య పారణ చేయాలని పేర్కొంటారు. హరివాసర ముగింపు సమయం మధ్యాహ్నం 12:07 గంటలుగా ఉంటుంది.

చెరకుతో మండపం ఎందుకు ఏర్పాటు చేస్తారు?
ఈ సందర్భంగా శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన శాలిగ్రామ స్వామి, తులసీదేవి వివాహాన్ని నిర్వహించడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా ఉంది. ఈ తులసీ వివాహం కోసం చెరకుతో మండపాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక సంప్రదాయంగా భావిస్తారు. చెరకు సహజంగా తియ్యగా ఉండటంతో కుటుంబ జీవితంలో మాధుర్యం, సంతోషం, ఐక్యత కలగాలని కోరుకునే సంకేతంగా దీనిని భావిస్తారు. అలాగే చెరకు వేగంగా పెరిగే స్వభావం కలిగి ఉండటంతో కుటుంబంలో అభివృద్ధి, శ్రేయస్సు, సంతానం వృద్ధి కలగాలని ప్రార్థిస్తారు. అందువల్ల చెరకు మండపం కొత్త ఆరంభాలకు, శుభానికి ప్రతీకగా నిలుస్తుందని భక్తుల విశ్వాసం.


సింగాడా, చిలగడదుంప, రేగి పండ్లు ఎందుకు సమర్పిస్తారు?


సమయంలో సీజన్‌కు అనుగుణంగా లభించే సింగాడా (నీటి కాయ), చిలగడదుంప, ఉసిరికాయ, రేగి పండ్లు వంటి వాటిని పూజలో నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. కొత్తగా లభించిన పంటలు, పండ్లను ముందుగా దేవుడికి సమర్పించి, ఆ తర్వాత స్వీకరించడం మన ప్రాచీన సంప్రదాయాల్లో ఒకటిగా భావిస్తారు.

మరోవైపు, కాలానుగుణంగా లభించే ఈ ఆహార పదార్థాలు ఉపవాస సమయంలో కూడా ఉపయోగపడతాయి. సింగాడా, చిలగడదుంప వంటి వాటిని శక్తినిచ్చే ఆహారంగా తీసుకుంటారు. ఉసిరి, రేగి వంటి పండ్లను కూడా కాలానుగుణ ఆహారంలో భాగంగా ఉపయోగిస్తారు. ఈ విధంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం, కొత్త పంటలను సమర్పించడం, ప్రకృతితో అనుబంధాన్ని చాటుకోవడం వంటి భావాలు ఈ సంప్రదాయం వెనుక ఉన్నాయని చెబుతారు. అందుకే కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా, భక్తి, ప్రకృతి, కుటుంబ శ్రేయస్సు, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భావించబడుతుంది.

Related posts