Nalgonda Murder: నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల పాటు సాగిన ఒక సంసారం కుటుంబ కలహాల కారణంగా తీవ్ర విషాదాంతంగా ముగిసింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా సేవలందిస్తున్న మహబూబ్ బీ (43) అనే మహిళ తన భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సంసారంలో ఘర్షణ.. ప్రాణాలు తీసిన ఉన్మాదం
నల్గొండ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న మహబూబ్ బీకి, గతంలో హోంగార్డుగా పనిచేసి ఉద్యోగం కోల్పోయిన సతీశ్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం పిల్లలు బడికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య గొడవ ఏర్పడింది. ఆవేశంతో రగిలిపోయిన సతీశ్ భార్యపై దారుణంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహబూబ్ బీ అక్కడిక్కడే మృతి చెందింది.

రక్తపు మడుగులో మృతదేహం.. రంగంలోకి పోలీసులు
విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, రూరల్ ఎస్సై శివప్రసాద్, వనౌన్ ఎస్సై నాంపల్లి వెంకట్ నారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు సతీశ్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశామని, ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.
Also read
- వివాహేతర సంబంధం.. శృంగారంలో చేస్తుండగా ఇరుక్కుపోయిన ప్రైవేట్ పార్ట్.. ఆ భంగిమలోనే ఆస్పత్రికి తరలింపు

- ఫోన్లో మాట్లాడొద్దన్న భర్త.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

- పెళ్లి అయినా తొమ్మిది నెలలకే వివాహిత ఆత్మహత్య..

- రోజూ రాత్రి భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడితో!

- కట్టుకున్న భర్తేకాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?

