మోపిదేవి: పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మోటారుకు కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె. కొత్తపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలిమెట్ల రుద్రవర్మ (చందు) ఇంటి వద్ద మోటారుకు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు యువకుడ్ని అవనిగడ్డ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పండగ రోజు యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..
Also read
- చోరీ అట్టర్‌ప్లాప్.. అద్దెకుంటూ యజమాని ఇంట్లోనే దొంగతనం.. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో దొరికిపోయాడు..!
- మోపిదేవిలో విషాదం.. ఆ అమ్మకు కడుపు కోత
- కత్తితో దాడిలో బిహార్ వాసి మృతి
- చిల్లర డబ్బుల విషయంలో ఘర్షణ: ఒకరి మృతి
- ఆకాశ దీపం అంటే ఏంటి ? కార్తీకంలోనే దీన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసా?





