రంగారెడ్డి జిల్లా: అభం శుభం తెలియని మైనర్ బాలికపై మారు తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. తల్లిని చంపేస్తానని బెదిరిస్తూ ఆరో తరగతి చదువుతున్న బాలికపై నిందితుడు నెల రోజులుగా అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. బాలాపూర్ ప్రాంతానికి చెందిన గులామ్ దురానీ అన్వర్ అనే వ్యక్తి తన మారు కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరో తరగతి చదువుతోంది. గత నెల రోజులుగా బాలికను బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయం బయటకు చెబితే తన తల్లిని చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయంతో ఇన్నాళ్లూ ఎవరికీ చెప్పలేకపోయింది.
అయితే తాజాగా తల్లి నిందితుడి దారుణాన్ని గుర్తించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో బాధిత బాలికతో కలిసి ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. బాలిక వాంగ్మూలం, ఫిర్యాదు ఆధారంగా నిందితుడు గులామ్ దురానీ అన్వర్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మైనర్ బాలికకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తే ఇలాంటి నేరానికి పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికకు అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్ అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also read
- అమ్మాయిల నుంచి అండాలు.. అబ్బాయిల నుంచి వీర్యకణాలు.. హాస్టళ్లల్లో సరికొత్త దందా..!
- పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది.. సంతోష్‌తో కలిసి సవిత ఏం చేసిందంటే..
- రాప్తాడు విద్యార్థిని దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియన్.. పోలీసులకు కీలక ఆదేశాలు
- స్కూల్లోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి.. మరో బాలికకూ గాయాలు!
- బేకరీలో పనిచేస్తున్న యువతిపై కత్తి దాడి.. చికిత్స పొందుతూ మృతి!





