నాగులుప్పలపాడు: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి ఆపై హతమార్చాడు. ఆదివారం ఈ ఘటన జరిగింది. బాలికను అమ్మమ్మ వద్ద ఉంచి తల్లిదండ్రులు హైదరాబాద్ లో బేల్దారి పనులకు వెళ్లారు. ఆదివారం అర్థరాత్రి ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న బాలికను అదే కాలనీకి చెందిన ఆనంద్ అక్కడి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం హతమార్చి ఇంటి వద్ద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారయ్యాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్క తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- కట్టుకున్నవాడే కాలయముడయ్యాడా?
- గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి సంతకాలు
- ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
- ఉద్రిక్తత.. బిర్యానీ తిని ఇద్దరు చిన్నారులు మృతి?
- కృష్ణానదిలో నాటుపడవ మునక.. ఇద్దరు బాలురు మృతి





