ప్రాతూరు(తాడేపల్లి) కృష్ణానదిలో నాటుపడవ మునిగి ఇద్దరు బాలురు మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతూరులో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాతూరుకు చెందిన ఈశ్వర్, సందీష్, సంతోష్, అర్జున్, హర్షలు స్నేహితులు. వీరంతా శనివారం పడవలో నదీపాయను దాటి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు మరో నాటు పడవలో బయల్దేరారు. ఈ క్రమంలో దానిలోకి నీరు చేరడంతో మునిగిపోయింది.
ఇందులో సందీప్, సంతోష్, ఈశ్వర్లు నదిలో ఈదుకుంటూ రాగా ప్రాణాలతో బయటపడ్డారు. అర్జున్ (17), హర్ష (18) గల్లంతయ్యారు. విషయాన్ని మిగిలిన ముగ్గురు.. గ్రామంలో తెలియజేయడంతో గ్రామస్థులు, పోలీసులు నదీపాయ వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లు. అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలించి, అర్జున్, హర్ష మృతదేహాలను వెలికితీశారు. అర్జున్ పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. హర్ష తాడికొండలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం (సీఈసీ) చదువుతూ వసతి గృహంలో ఉంటున్నాడు. దసరా సెలవులు కావడంతో హర్ష స్వగ్రామమైన ప్రాతూరు వచ్చాడు. హర్ష తల్లి రెండేళ్ల క్రితం చనిపోగా, తండ్రి మూడేళ్ల క్రితం కన్నుమూశారు
Also read
- కట్టుకున్నవాడే కాలయముడయ్యాడా?
- గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి సంతకాలు
- ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
- ఉద్రిక్తత.. బిర్యానీ తిని ఇద్దరు చిన్నారులు మృతి?
- కృష్ణానదిలో నాటుపడవ మునక.. ఇద్దరు బాలురు మృతి





