స్థానిక సంస్థల ఎన్నికల్లో దాచేపల్లి నగర పంచాయతీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంపికైన కొప్పుల రవి ఇంట్లో తెలంగాణ మద్యం దొరకడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు తాయిలాలు పంచుతుంటారు. అయితే వీటికి అడ్డుకట్టవెయ్యడానికి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల వేళ మద్యం అక్రమరవాణా, డబ్బు వంటివి పంచే ఏర్పాట్లను పోలీసులు అడ్డుకుంటారు. అయితే ఎన్నికల వేళ రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తీసుకొచ్చే వారు లేకపోలేదు ఇలాంటి వారిపై అధికారులు నిఘా పెట్టి వారి ఆటకట్టిస్తున్నారు. ఇటువంటి ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
429 మద్యం సీసాలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో దాచేపల్లి నగర పంచాయతీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంపికైన కొప్పుల రవి ఇంట్లో తెలంగాణ మద్యం దొరకడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసే రోజు పంపిణీ చేయడానికి రవి అనుచరుడు బుర్రి అనిల్‌తో పాటు మరికొందరు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై ఖాసింవలి శుక్రవారం తెల్లవారుజామున రవి నివాసంలో తనిఖీలు చేపట్టగా, రూ.64,640 విలువైన 429 మద్యం సీసాలు దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు రవి, అనిల్‌లను అరెస్ట్ చేశారు.
నిందితులకు నెల 30 వరకు రిమాండ్: ‘నామినేషన్ సందర్భంగా అందరూ మద్యం పంపిణీ చేస్తారని, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కదా!’ అని రవి సీఐకి చెప్పి వదిలేయాలని కోరారు. ఈ వ్యవహారంతో రవికి సంబంధం లేదని, మద్యం తీసుకొచ్చి భద్రపరిచింది తానేనని బుర్రి అనిల్ సీఐ ఖాజావలికి చెప్పి, తనను మాత్రమే అరెస్టు చేయాలని కోరడం గమనార్హం. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు దాచేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట కొంతసేపు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు మురళీధర్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకొని సీఐతో వాగ్వాదానికి దిగారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా, ఈ నెల 30 వరకు రిమాండ్ విధించారు. ఇటువంటి ఘటలు జరగకుండా పోలీసులు తగిన చర్యులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Also read
- మద్యం రవాణా కుంభకోణం- కారుమూరి సునీలే ప్రధాన సూత్రధారి!
- వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ మద్యం – ఇద్దరు అరెస్ట్
- రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ – ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
- రాజంపేటలో తీవ్ర ఉద్రిక్తత – ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటిపై దాడి
- ఆదివారం దుర్గాష్టమి వేళ అరుదైన యోగం.. ఈ రాశులకు బంపర్ జాక్ పాట్ తో పాటు ఉద్యోగంలో ప్రమోషన్.!.

