పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమ-వారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు.
భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్ పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్‌లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు.
Also read
- తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో ఏం చేశాడంటే..?
- చదివింది పదో తరగతే.. డీఎస్పీ అవతారమెత్తి రూ.26 లక్షలు వసూలు! చివరకు ఎలా చిక్కాడంటే..!
- నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం వెలిగించాలా? సరైన పద్ధతి ఇదే!
- Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!





