పెద్దతిప్పసముద్రం, : మద్యానికి బానిసైన ఓ భర్త.. తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను హత్యచేసిన ఘటన అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన రమాదేవి(27)కి బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన సురేశ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ కూలీలే. మూడు నెలల క్రితం వారు గొడవ పడటంతో పిల్లలను రమాదేవి తన తల్లిదండ్రుల దగ్గర ఉంచింది. గురువారం సురేశ్ మద్యం తాగి ఇంటికొచ్చి.. ప్రభుత్వం అందించిన తల్లికి వందనం డబ్బులు ఇవ్వాలంటూ భార్యతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో రమాదేవిపై కత్తితో దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతిచెందింది. అనంతరం సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





