రామచంద్రపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొలుత పావని (14) నీటిలో దిగి గల్లంతవగా.. ఆమెను కాపాడేందుకు రంజిత్ (15), వీరేంద్ర (19) కూడా కాల్వలోకి దిగారు. ఈ క్రమంలో వారు కూడా గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- తండ్రి మరణించినప్పుడు పెద్ద కొడుకే ఎందుకు అంత్యక్రియలు నిర్వహించాలి? ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- మంత్ర జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా? తెరిచి జపిస్తే ఫలితం ఎలా ఉంటుంది?
- Weekly Horoscope: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..12 రాశులకు వారఫలాలు
- మందు తాగి రోడ్డెక్కారు.. బండి ఆపిన పోలీసులకే క్లాస్ పీకారు! నడిరోడ్డుపై హైడ్రామా!
- చెరువుకు వెళ్తుండగా వెంటపడిన కోతుల గుంపు.. కుప్పకూలిన బాలుడు.. చివరకు..





