జైపూర్: ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకోకపోతే నా చావుకు కారణం నువ్వేనని బెదిరించాడు. పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టించినా దుర్మార్గుడి తీరు మారలేదు. ఆ వేధింపులు తట్టుకోలేక, అతడి నుంచి తప్పించుకునే దారి కనపడక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా బ్రపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గోషిక బాలేష్-రాజేశ్వరి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. నాలుగో సంతానం అయిన మాధవి (26) బీ పార్మసీ పూర్తి చేశారు. అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేశ్ అనే సింగరేణి కార్మికుడు రెండేళ్లుగా పెళ్లి పేరుతో ఆమెను వేదిస్తున్నాడు. ఇటీవల పురుగు మందు డబ్బాతో వాళ్ల ఇంటికెళ్లి హంగామా సృష్టించాడు.
విషయం పోలీస్ స్టేషన్ దాకా వేరి.. పెద్దమనుషుల పంచాయితీ జరిగినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ‘నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా. నా చావుకు కారణం నువ్వే అవుతావు అని బెదిరింపులకు దిగాడు. మందలించి, దారిలో పెట్టాల్సిన వెంకటేశ్ తల్లి శంకరమ్మ, అక్క శైలజ సైతం అతడికే వత్తాసు పలికారు. మావాడికి ఏమైనా అయితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ వేధింపులు తాళలేక, తీవ్ర మనస్థాపానికి గురైన మాధవి ‘నా చావుకు కారణం వెంకటేశ్ అని సూసైడ్ నోట్ రాసి, ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్, అతడి తల్లి, అక్కల మీద కేసు నమోదు చేశామని ఎస్సై భూమేష్ తెలిపారు. మాధవి చావుకు కారణమైన వెంకటేశిని కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.
Also read
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు





