ఉప్పల్లో టీజీపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించిన దంపతులు
హైదరాబాద్, హస్తినాపురం: భార్యతో జరిగిన చిన్నపాటి గొడవతో మనస్తాపం చెందిన ఓ యువ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంవాసి గుట్ల రాజేశ్(26) డిజైనర్గా పనిచేస్తూ భార్య ఆశాప్రవళికతో కలిసి వనస్థలిపురం శ్రీపతినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
దంపతులిద్దరూ గురవారం ఉప్పల్లో జరిగిన టీజీపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించిన తర్వాత ఇంటికి వెళ్లారు. అనంతరం రాజేశ్ తన స్నేహితుడు విజయ్కుమార్తో కలిసి మద్యం సేవించాడు. మద్యం సేవించే సమయంలో రాజేశ్ తన భార్యతో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. మనస్తాపం చెందిన రాజేశ్ గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి చక్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాపులో ఉంది.
Also read
- Jyeshtha Purnima: జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం!
- దేవాలయాల్లోని పవిత్ర జలాశయాల్లో స్నానం ఎందుకు చేయాలి? ఈ ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- స్ట్రాబెర్రీ మూన్.. జూన్ 29 రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ టైమ్లో చూస్తే భారీ చంద్రుడు కనిపిస్తాడు!
- నేటి జాతకములు 28 జూన్, 2026
- షకీల్గా పేరు మార్చుకుని.. 23 ఏళ్లకు చిక్కిన నేరస్తుడు
నిందితుడు అర్షద్ అలీ





