ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్ విచారణలో బయటపడింది
విజయవాడ, జూన్ 26: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి రోజు రోజుకూ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్ విచారణలో బయటపడింది. సీఐ నాగరాజు అరెస్ట్ తరువాత హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, జంగం నాని, స్నేహితుడు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహరాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ నాని కీలకంగా ఉన్నట్లు సమాచారం
గన్నవరంలో సస్పెండ్ కాగా, పటమట స్టేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన అభియోగాల నేపథ్యంలో జంగం నానిని ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఇటీవలే కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్‌గా నానికి పోస్టింగ్ ఇచ్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుతో కలిసి అశోక్, నాని, సురేష్ ముఖ్యపాత్ర పోషించినట్లు విచారణలో సిట్ తేల్చింది. సీడీఆర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ముగ్గురూ కీలకంగా ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో పరారీలో ఉన్న ముగ్గురి కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




