కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
కర్నూలు జిల్లా, జూన్ 25: కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు (24) కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బోయజు కొంతకాలంగా కర్నూలులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల తన స్నేహితురాలు (గర్ల్‌ఫ్రెండ్) ఫోన్లో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం కారణంగా మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల వాంగ్మూలాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డుల ఆధారంగా మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





