చిన్నశంకరంపేట (మెదక్): ప్రేమ వ్యవహారం, ఆర్థిక లావాదేవీలు ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చురేపింది. తొలుత ఒకరి హత్యకు, ఆపై ప్రతీకార హత్యకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధరన్‌ను అదే గ్రామానికి చెందిన రాణబోయిన ప్రభాకర్ సోమవారం ఆటోతో ఢీకొట్టి, తలపై రాడ్‌తో మోది హత్య చేశాడు. అనంతరం తూప్రాన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
అయితే కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన శ్రీధర్ తండ్రి కిషన్‌తోపాటు మరికొందరు తూప్రాన్ పోలీస్టేషన్ వద్ద ప్రభాకర్ కోసం మాటువేశారు. ఈ క్రమంలో ప్రభాకర్ తండ్రి రాణబోయిన యాదగిరి (55) భోజనం చేసి వస్తున్న క్రమంలో ఆటోలో అపహరించి హతమార్చారు. అనంతరం మృతదేహానికి బండరాయి కట్టి హల్దీ ప్రాజెక్టులో పడేశారు. కేవలం పన్నెండు గంటల్లోనే జంట హత్యలు జరగడం గమనార్హం. అయితే యాదగిరి కిడ్నాప్‌పై హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుల ఫోన్లను ట్రాక్ చేసి హల్దీ ప్రాజెక్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు.చెల్లెలు వరుసయ్యే యువతిని స్నేహితుడు ప్రేమించడంతో..
సూరారం గ్రామానికి చెందిన ప్రభాకర్ ఆటోను శ్రీధర్ కొంతకాలం అద్దెకు నడిపాడు. ఆ సమయంలో ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో తన ఆటోను రూ. 1.20 లక్షలకు విక్రయించేందుకు ప్రభాకర్ ముందుకురాగా శ్రీధర్ రూ.70 వేలు చెల్లించాడు. అయితే శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయిన యువతిని ప్రభాకర్ ప్రేమించడం, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. దీంతో శ్రీధర్ ప్రభాకర్‌కు డబ్బులివ్వలేదు. 15 రోజుల క్రితం ఆ యువతిని ప్రభాకర్ పెళ్లి చేసుకోవడంతోపాటు శ్రీధర్‌కు ఫోన్ చేసి దమ్ముంటే తేల్చుకోవాలని సవాల్ విసరడంతో మరో వ్యక్తితో కలిసి శ్రీధర్ అతని వద్దకు వెళ్లగా హతమార్చాడు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




