పుణె: మహారాష్ట్రలోని పుణె వద్ద పెళ్లాడబోయే యువతి ఫొటోలు తీస్తూ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) లోయలో పడి మృతిచెందినట్టుగా నమోదైన కేసు పెద్ద మలుపు తిరిగింది. అది ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. నిందితులైన సియా గోయల్ (20)ను, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)ని మంగళవారం అరెస్టు చేశారు. కేతన్ ఈ నెల 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగుకు వచ్చామని, కేతన్ ఫొటోలు తీస్తూ హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా గోయల్ లోనావాలా గ్రామీణ పోలీసులకు తెలిపింది. తదుపరి విచారణలో సియా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె మొబైల్ డేటా పరిశీలించి లోతుగా దర్యాప్తు చేయగా.. సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతనను లోయలోకి తోసి, ప్రమాదంగా చిత్రీకరించారని తేలింది.
Also read
- Vijayawada: సాయికృష్ణ కేసు లో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?
- గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ మాట్లాడలేదని మనస్తాపం.. యువకుడి మృతి
- షాకింగ్: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర
- అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం
- గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు





