తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని నెయ్యి గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాము లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగి సరకు మొత్తం కాలిపోయింది.
ప్రస్తుతం గోదాములో కొంతకాలంగా అల్లం, వెల్లుల్లిపాయలు నిల్వచేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో గోదాములోని సరకుతో పాటు కారు కూడా దగ్ధమైంది. నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. యజమాని అందుబాటులో లేకపోవడం వల్ల ఎంత నష్టం అనేది చెప్పలేమని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 23 జూలై, 2026
- varahi ammavaru: వారాహి అమ్మవారి పుట్టుక గురించి తెలుసా..? అసలు ఆమెకున్న శక్తులేంటో తెలుసా..?
- మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే
- తిరుమల మొదటి ఘాట్లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు
- వెంటాడి.. వేటాడి రౌడీషీటర్ హత్య





