కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) హాస్టల్ గదిలో మృతి చెందగా, ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
కృష్ణా జిల్లా: గన్నవరం మండలం కేసరపల్లిలోని శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు క్యాంపస్‌కు చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతికి కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి బంధువులను పోలీసులు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



