మామిడికుదురు: అనారోగ్యంతోబాధపడుతున్న తల్లికి మందులు తీసుకు వచ్చేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై కుమారుడు మృతి చెందాడు. మొగలికుదురులో మంగళవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇవీ.. గెద్దాడకు చెందిన గుబ్బల మనోహర్ (22) విజయవాడలో ఏసీ మెకానిక్గా పని చేస్తున్నాడు.
తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో సోమవా రం రాత్రి స్వగ్రామం వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమెకు మందులు తీసుకు వచ్చేందుకు బైక్పై వెళుతుండగా మొగలికుదురు ప్రధాన రోడ్డుపై వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ మోటార్ సైకిల్ సడన్ గా మలుపు తిరిగి మనోహర్ బైకును ఢీకొంది.
ఈ ఘటనలో రోడ్డుపై పడి గాయపడిన మనోహర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి బాల శ్రీను ఫిర్యాదుపై నగరం ఎస్ఐ ఎ. చైతన్యకుమార్ కేసు నమోదు చేశా రు. మృతుడు అవివాహితుడు. చేతికి అందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





