ధర్పల్లి: మండలంలోని గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన లక్షిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గోవింద్‌పల్లికి చెందిన నెహ్రూతో మోస్రా గ్రామానికి చెందిన లక్షితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది.
పైళ్లెన రెండు నెలల నుంచే భర్త నెహ్రూతోపాటు అత్తామామలు అదనంగా రూ.2 లక్షల వరకట్నం తీసుకురావాలని లక్షితను వేధించినట్లు ఆమె తండ్రి పిట్ల మోహన్ ఫిర్యాదు లో పేర్కొన్నాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిందని, సోమవారం సాయంత్రం సైతం తమ కూతురిని అత్తింటి వారు వేధించారని ఫిర్యాదు చేశాడు.
లక్షిత చని పోయిందని తమకు సమాచారం ఇచ్చారని, ఆమె మరణంపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తహసీల్దార్ శాంత సమక్షంలో శవ పంచనామా పూర్తి చేశామని, ఏసీపీ ప్రకాశ్‌యాదవ్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారని ఎస్సై తెలిపారు.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్‌లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





