రాజాం, : కన్నా చెడు స్నేహాలు వద్దు.. బాగా చదువుకో అని తల్లి చెప్పిన మాటలు అతడికి చెవికెక్కలేదు. ఇలాంటి మాటలు చెబుతున్న అమ్మను అడ్డుతొలగించుకోవాలని మూర్ఖంగా ఆలోచించాడు. మిత్రుడి సాయంతో తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. విజయనగరం జిల్లా రాజాంలో ఈ నెల 4న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజాంకు చెందిన ముంజేటి సతీష్, స్పందన(34) దంపతులు. వీరికి 16 ఏళ్ల కుమారుడు సంతానం. ఇటీవలే పదోతరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మంచిగా మారాలని తల్లి చెబుతూ ఉండేది. ఇది నచ్చని కుమారుడు అమ్మపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో బాలుడు(17) క్రికెట్ మైదానంలో ఇతడికి పరిచయమయ్యాడు. తండ్రి తన తల్లిని నిర్లక్ష్యం చేసి మరో మహిళతో ఉంటున్నాడని, వారిని అడ్డు తొలగించుకుని, ముంబయి వెళ్లి డాన్ లుగా ఎదుగుదామని పరిచయమైన బాలుడు ఇతడితో చెప్పాడు. అలా స్పందన హత్యకు ప్రణాళిక రూపొందించారు.
ఆకలేస్తోందని పిలిపించి..
ఈ నెల 4న ఉదయం స్పందన పక్క వీధిలోని పుట్టింటికి వెళ్లింది. ఈ విషయాన్ని బాలుడు స్నేహితుడికి చెప్పడంతో అతడు కత్తితో వీళ్లింటికి వచ్చాడు. బీరువాలోని తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5 వేలు తీసి బ్యాగులో సర్దుకున్నారు. అమ్మమ్మకు ఫోను చేసి ఆకలిగా ఉంది.. అమ్మను పంపించమని చెప్పాడు. తిరిగి వచ్చిన తల్లి కాళ్లు కడుక్కునేందుకు స్నానాల గదిలోకి వెళ్లగా.. అక్కడే కాపు కాసిన కుమారుడి మిత్రుడు ఆమె పీక పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి కత్తితో పొడిచి ఆమెను చంపేశారు. స్పందన శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నాయి. చనిపోయాక చీరతో చుట్టేసి సమీపంలోని కోనేరులో పడేశారు. అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు స్పందన కుమారుడు కనిపించకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్య తర్వాత ఇద్దరు నిందితులు రైలులో భువనేశ్వర్ వెళ్లారు. ముంబయి, తిరుపతి, విశాఖపట్నం తిరిగి పలాసకు వెళ్లే క్రమంలో చిలకపాలెం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు.
Also read
- మంచిగా ఉండమంటే.. తల్లినే చంపేశాడు..మిత్రుడితో కలిసి 16 ఏళ్ల కుమారుడి ఘాతుకం
- Sankashti Chaturthi :ఏడు రోజుల్లో మీకోరిక నెరవేరాలంటే…
- The Buddha:గోతమ బుద్ధుడు నెత్తిపై ఉన్న 108 పీతల రహస్యం
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో తాత.. మనవడిని బతికించి ప్రాణాలు వదిలేశాడు.. అసలేం జరిగిందంటే..?





