SGSTV NEWS online
CrimeTelangana

వ్యాపారిని చంపిన కానిస్టేబుల్ దంపతులు






సిద్దిపేట , ఆన్లైన్ బెట్టింగులకు బానిసైన ఓ కానిస్టేబుల్… అప్పులను తీర్చేందుకు స్థిరాస్తి వ్యాపారిని తన భార్యతో కలిసి హత్య చేసిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన ప్రకారం…

చిన్నకోడూరుకు చెందిన కానిస్టేబుల్ గౌటీ ప్రవీణ్ కుమార్ 2007లో ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్నాడు. భార్య రజితతో కలసి రెండేళ్లుగా బెట్టింగులకు పాల్పడుతూ రూ.60 లక్షలు నష్టపోయాడు. రూ.30 లక్షలు అప్పులయ్యాయి. వాటిని తీర్చేందుకు వక్రమార్గంలో డబ్బులు సంపాదించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పట్టణానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి బెట్టె విశ్వనాథం(57) బంధువు వద్ద ప్రవీణ్ తన తమ్ముడికి చెందిన ఓ స్థలాన్ని. తాకట్టు పెట్టి రూ.12 లక్షలు అప్పుగా ఇప్పించాడు. కుదవ పెట్టిన ప్లాటును విక్రయిస్తామని విశ్వనాథం చెప్పగా… వద్దని వారించి మరో ప్లాటు చూపిస్తానంటూ కానిస్టేబుల్ నమ్మించాడు. గత శనివారం ప్రవీణ్, రజిత దంపతులిద్దరూ కలిసి తమ కారులోనే విశ్వనాథాన్ని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

కారులోనే అతని కాళ్లూ చేతులను కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి హత్య చేశారు. అతని ఒంటిమీదున్న 10 తులాల బంగారు నగలను తీసుకుని… మృతదేహాన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేశారు. అక్కడి నుంచి కారులోనే హైదరాబాద్ వెళ్లి ఒక బంగారం దుకాణంలో నగలను విక్రయించి సొమ్ము చేసుకున్నారు..

అదృశ్యం కేసుతో వెల్లడి…

తన భర్త ఇంటికి రాలేదని విశ్వనాథం భార్య వనిత అదేరోజు చిన్నకోడూడు దాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలించి.. ఆదివారం రాత్రి వ్యాపారి మృతదేహాన్ని గుర్తించారు. ఏసీపీ పర్యవేక్షణలో సీసీఎస్ టాస్క్ పోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించారు. కానిస్టేబుల్ దంపతులను మంగళవారం అరెస్టు చేసి బుధవారం రిమాండ క్కు తరలించారు. నాలుగు రోజుల్లోనే కేసును చేదించిన పోలీసులను కమిషనర్ రష్మీ, పెరుమాళ్ అభినందించారు.

వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ


గత నెల 25న ప్రవీణ్ దంపతులు తమ ఇంటి సమీపంలో నివాసముండే వృద్దురాలు బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. దాన్ని హైదరాబాద్లో విక్రయించగా వచ్చిన రూ.4.80 లక్షలను సైతం బెట్టింగ్లో పెట్టి కోల్పోయారు. మరునాడు ప్రవీణ్ తనకేమీ తెలియనట్లుగా బాధితురాలితోనే వన్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించటం గమనార్హం

Also read

Related posts