కడప జిల్లా ఒంటిమిట్ట హరిత హోటల్‌లో పత్రికా విలేకరి నాలుకను మహిళా కొరికిన ఘటన సంచలనం రేపింది. మద్యం మత్తులో రొమాన్స్ అదుపు తప్పడంతో ఈ అఘాయిత్యం జరిగింది. అక్రమాలకు నిలయంగా మారిన ఈ హోటల్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పత్రికా విలేకరి అయ్యుండి పనికిమాలిన పని చేశాడు ఓ ప్రబుద్ధుడు.. మద్యం మత్తులో శ్రుతిమించిన రొమాన్స్ చేస్తుండగా మహిళను హింసిస్తుండడంతో ఆమె ఒక్కసారిగా నాలుక కొరికేసింది. దీంతో అతను ఒక్కసారిగా ఆసుపత్రికి పరుగులు తీశాడు.. ఈ షాకింగ్ ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల ప్రకారం.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముల వారి దేవాలయం సమీపంలో ఉన్న హరిత హోటల్ అక్రమాలకు నిలయంగా మారింది. గతంలో హరిత హోటల్ ను విచ్చలవిడిగా ఎవరికి పడితే వారికి ఇస్తున్నారు అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉండే ఈ హరిత హోటళ్ళలో ముందుగా రూమ్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. కానీ ఒంటిమిట్టలో మొన్న జరిగిన అఘాయిత్యంతో హరిత హోటల్ లో పనిచేసే సిబ్బంది ఆగడాలకు అడ్డుపద్దు లేకుండా పోయింది అనేది అర్థమవుతుంది. స్దానికమగా పత్రిక విలేకరిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఒంటిమిట్ట దేవాలయం సమీపంలో వ్యాపారం చేసుకుంటూ విలేకరిగా ఓ పేపర్లో కొనసాగుతున్నాడు.
అయితే, వ్యాపార నిమిత్తం పుచ్చకాయలు కొనుగోలు చేయడానికి, దానిని సరఫరా చేయడానికి సంబంధించి విలేకరికి ఓ ఆటో డ్రైవర్ తో పరిచయం ఉంది. గత నాలుగు రోజుల క్రితం కూలీ పనికి వెళ్లే ఓ మహిళను ఆటో డ్రైవర్ హరిత హోటల్‌కు తీసుకొని వచ్చాడు. అక్కడ పత్రిక విలేకరి, ఆటో డ్రైవర్, మహిళా ముగ్గురు ఫుల్లుగా మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకి తెరలేపారు. అయితే, విలేకరి మహిళతో శారీరక సబంధం పెట్టుకున్నాడు.. ఈ క్రమంలోనే.. విలేకరి ఆ మహిళను బాధించగా.. మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ విలేకరి నాలుకను బలంగా కొరికినట్లు సమాచారం.. తీవ్రంగా గాయపడిన ఆ విలేకరి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆసుపత్రికి వెళ్ళగా వారు అక్కడి నుంచి కడప రిమ్స్ కు తరలించారు.
అయితే, నాలుక కొరికిన ఆ మహిళను అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ వెంటనే తీసుకుని వెళ్లి ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ లో దింపినట్లు సమాచారం.. ప్రస్తుతం ఆ మహిళ ఎవరు అనేదానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. అలాగే నాలుక తెగిపడిన విలేకరికి కడప రిమ్స్ లో చికిత్స జరుగుతుంది. కానీ దీనిపై పూర్తి సమాచారాన్ని అతను ఇవ్వకపోవడంతో.. హరిత హోటల్ లో ఉన్న ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ విషయంపై ఇటు పర్యాటక శాఖ అలాగే కలెక్టర్.. హరిత హోటల్ సిబ్బందిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కచ్చితమైన కారణాలను తెలియజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.. మొత్తం మీద ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఒంటిమిట్టలోని హరిత హోటల్ సిబ్బంది పనితీరు.. అక్కడ జరిగే కలాపాలు చర్చనీయాంశంగా మారాయి.
Also read
- రెండు రోజుల్లో కుమార్తె వివాహం…
- అత్యాశకు పోయి.. అధిక వడ్డీ వలకు చిక్కి..
- వ్యాపారిని చంపిన కానిస్టేబుల్ దంపతులు
- కోనసీమలో పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ – 39 మందికి అస్వస్థత
- రేణుకను పక్కా ప్లాన్‌తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం




