శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాయిబాబా గుడి దగ్గర ఉన్న IDFC బ్యాంకు ఏటీఎంను మెషిన్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఏటీఎం మెషిన్ కు తాడు కట్టి… బొలెరో వాహనంతో దుండగులు పగలగొట్టి లాక్కెళ్లారు. ఏటీఎం మెషిన్ లో సుమారు పది లక్షల రూపాయల నగదు ఉన్నట్లు బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. ఏటీఎం మెషిన్ తీసుకుని బత్తలపల్లి వైపు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఏటీఎం మెషిన్ చోరీ దృశ్యాలు ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు..
ధర్మవరం, మే 6: ఏటీఎం ఎత్తుకెళ్లడానికి ఓ దొంగ ముఠా నానాఅగచాట్లు పడ్డారు. ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు తొలుత ఇనుప రాడ్లతో ఏటీఎమ్ మిషన్ను పగలగొట్టి ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏకంగా బోలెరో వాహనంతో ATMను బయటకు ఈడ్చుకెళ్లి అదే వాహనంలో దాన్ని ఎక్కించుకుని ఉడాయించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మే 6 (బుధవారం) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..
ఈ రోజు ఉదయం తెల్లవారు జామున ముసుగు ధరించిన దొంగల ముఠా ఒకటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం దోచుకునేందుకు వచ్చింది. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఎస్యూవీలో సంఘటనా స్థలానికి చేరుకుని మొదట ఇనుప రాడ్లతో ఏటీఎంను పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో వారు మరింత సాహసోపేతమైన పద్ధతిని అవలంబించారు. దుండగులు యంత్రానికి తాళ్లు కట్టి, బొలెరో వాహనంతో దాన్ని బలవంతంగా బయటకు లాగి, వాహనంలోకి ఎక్కించుకుని బట్టలపల్లి వైపు పారిపోయారు. కొద్దిసేపటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎంలో ఉన్న నగదు మొత్తాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Also read
- Garuda Purnam: కొడుకు లేకపోతే అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి? గరుడ పురాణం చెబుతున్న ఆసక్తికర వాస్తవాలు!
- అరుణాచల గిరి ప్రదక్షిణ: ఆరంభ స్థానం, దాని ప్రాముఖ్యత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఆమె ఎలా చనిపోయింది..?
- ఎస్ఐ కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు!





