హైదరాబాద్: ఐఫోన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుద్భిగూడ ప్రాంతానికి చెందిన బక్కి ప్రియ (42)కు 20 ఏళ్ల క్రితం మల్లికార్జున్ ముస్తాపూర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.
కొత్తగా తీసుకొచ్చిన ఐ ఫోన్ను తన కజిన్కు భర్త ఇచ్చాడు. ఈ విషయంపై ఆదివారం ఉదయం భార్యాభర్తులు గొడవపడ్డారు. ఆవేశంలో ప్రియ ఇంట్లో ఉన్న చెదల మందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే ఆమెను కాచిగూడలోని సీసీ ప్రాఫ్ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రియ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





