Chittoor Crime News | చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో ఓ జర్నలిస్ట్ దారుణహత్యకు గురయ్యాడు. ఓ రౌడీ షీటర్ ప్లాన్ ప్రకారం వెంబడించి మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో హత్య చేశాడు.
వెంకటగిరి: చిత్తూరు జిల్లాలో జర్నలిస్టును ఓ రౌడీ షీటర్ దారుణంగా హత్యచేశాడు. వెంకటగిరి కోట (వి.కోట)లో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని కత్తితో నరికి హత్య చేశారు. పాత కక్షలు, వ్యక్తిగత గొడవలతో హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు తమీమ్ అనే రౌడీ షీటర్ అని, అతడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక శ్రీగంధం స్మగ్లింగ్ కేసులో జగన్మోహన్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించి సహకరించాడనే కోపంతోనే, తమీమ్ ఈ హత్య చేసినట్లు సమాచారం. ఈ హత్య పక్కా పథకం ప్రకారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్తారనే విషయాన్ని గమనించిన నిందితులు, ఆయన ఒంటరిగా ఉన్న సమయం చూసి వేటకొడవళ్లతో దాడి చేసి ప్రాణాలు తీశారు. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, పోలీసులకు సహకరించడమే జగన్మోహన్ రెడ్డి ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
Also read
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?




