విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
Car accident : విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు, పేరాపురం జంక్షన్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను కారు బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపులో లేని కారు ఒక లారీని కూడా ఢీకొట్టడంతో, కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో, పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hanuman Jayanti: హనుమాన్ జయంతి మంగళవారమే..! ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
- Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
- Hanuman Jayanti Special: ఆంజనేయుడికి తమలపాకుల ఇష్టం వెనుక కథ ఏమిటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఆమె రాత్రిపూట రేటు మాట్లాడుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్తుంది.. కాసేపటికి..





