బెంగళూరు: కొడగు జిల్లా మడికెరి తాలూకా చేరంబాణె
గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామవాసి రోహిణి (51) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం ఇంట్లో ఉన్న బ్యారెల్ తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడే మరణించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మడికెరి గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సాంబారు చేయలేదని…
తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా మూడగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. సౌజన్య పూజారి (22) మృతురాలు. శనివారం ఉదయం తండ్రి కాయగూరలు తెచ్చి మధ్యాహ్నం భోజనానికి సాంబారు వండాలని చెప్పి వెళ్లాడు. కానీ ఆమె చేయలేదు, భోజనవేళకు వచ్చిన తండ్రి.. ఎందుకు చేయలేదని దండించి, హోటల్ నుంచి సాంబారు తెచ్చుకుందామని బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి సౌజన్య ఉరికి వేలాడుతూ ఉంది. గోణిబీడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




