SGSTV NEWS online
CrimeTelangana

అనవసర విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి




నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయానికి ఆది, గురు వారాల్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు.దర్వేశిపురంలోని ఫంక్షన్ హాల్ లో సైదులు (56), మేగావత్ గోపిలు నైట్ వాచ్మెన్ లుగా పని చేస్తున్నారు.

ఇటీవల కాలంలో చాల మంది చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు. పట్టు విడుపులు ఉండడం లేదు. క్షణికావేశంలో దాడులు చేసుకుంటున్నారు. పనికిరాని విషయాలతో స్నేహాలు, సహచరుల బంధాలు గాలిలో కలిసి పోతున్నాయి. కొన్నాళ్లుగా కలిసి పని చేస్తున్న ఇద్దరి మధ్య చిన్న వివాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయానికి ఆది, గురు వారాల్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు.దర్వేశిపురంలోని ఫంక్షన్ హాల్ లో సైదులు (56), మేగావత్ గోపిలు నైట్ వాచ్మెన్ లుగా పని చేస్తున్నారు. ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యక్రమ నిర్వాహకులు ఇచ్చే డబ్బులు, వస్తువులను కూడా ఇద్దరూ కలిసి పంచుకుంటారు. ఇదే క్రమంలో ఫంక్షన్ హాల్ లో నిర్వాహకులు ఖాళీ నూనె డబ్బాలను వదిలి వెళ్లారు. ఈ నూనె డబ్బాల విషయంలో సైదులు, గోపి లు గొడవ పడ్డారు. తీవ్ర వాగ్వివాదంతో ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో మెగావత్ గోపి.. సైదులుపై దాడి చేశాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన సైదులు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోపి దాడి చేయడంతోనే సైదులు మృతి చెందాడని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ.. మృత దేహంతో ఫంక్షన్హాల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవితేజరెడ్డి తెలిపారు.

Also read

Related posts