కాసుల వేటలో పక్కదారి పట్టారు..షార్ట్‌కట్‌లో లక్షలు సంపాదించే మార్గాలు వెతికారు…బట్ చివరకు ఆశ తీరకుండానే కటకటాల పాలయ్యారు.. ఇంతకీ ఎవరు వాళ్లు..ఏం చేశారు. ఈ కన్నింగ్ స్కామ్‌పై మీకు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం …
రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాతా నాణేలు, ఇత్తడి చెంబు, మ్యాజిక్ కాయిన్స్ అంటూ మోసాలకు దిగుతున్న ఘరానా ముఠాను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో నలుగురు అరెస్ట్ కాగా…ఇద్దరు పరారీలో ఉన్నారు. కుంబార్లపల్లికి చెందిన క్రిష్ణప్ప, కమ్మేపల్లికి చెందిన షేక్ ఇలియాజ్, కర్ణాటక కోలార్‌కు చెందిన మునీష్, చౌడేపల్లికి చెందిన విజయ్‌కుమార్, రాజులూరుకి చెందిన శంకర్, పెద్దపంజాణికి చెందిన నాగరాజు అరెస్ట్ అయ్యారు. అంతా ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. తమిళనాడు కృష్ణగిరికి చెందిన శేఖర్‌తో రైస్ పుల్లింగ్ ముఠా సంప్రదింపులు జరిపింది. రాయలపేటలో ఆంజనేయస్వామిగుడి దగ్గరకు వస్తే తమ దగ్గర ఉన్న మహిమ గల చెంబు ఇస్తామని నమ్మబలికారు. చెంబు దక్కితే కోటీశ్వరుడవుతావని మాయ మాటలు చెప్పారు. దీంతో ఆశపడ్డ బాధితుడు 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. కేటుగాళ్ల మాయమాటలను నమ్మి ముందుగా లక్ష చెల్లించి చెంబు తీసుకున్నాడు. ఇంటికివెళ్లాక అది పనికిరాని చెంబని తేలడంతో బోరుమన్నాడు.బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ముఠాను అరెస్ట్ చేశారు.ఇలాంటి మోసపూరిత మాటలను ఎవరూ నమ్మొద్దని సూచించారు పోలీసులు.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్‌లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





