సంగారెడ్డి జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అప్పుల గొడవలో సంబంధం లేని మహిళపై గ్రామస్తులు కర్కశంగా వ్యవహరించారు. భర్త చేసిన ఆర్థిక లావాదేవీలకు భార్యను బాధ్యురాలిని చేస్తూ ఆమెను నడిరోడ్డుపై చెట్టుకు కట్టేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
భర్త తీసుకున్న అప్పు చెల్లించలేదనే కోపంతో అంగన్‌వాడి టీచరైన ఓ మహిళను అప్పిచ్చిన వ్యక్తులు గ్రామం నడి ఒడ్డున ఉన్న చెట్టుకు కట్టేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కంగి మండలం రాసోల్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. పంచమహల్ దామరిగిద్ద గ్రామానికి చెందిన వసంతకుమారి, రాసోల్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఆమె భర్త ప్రభాకర్ రావు, గతంలో హెచ్‌బీఎన్ ఫైనాన్స్ పేరిట గ్రామస్తుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ నెల 7వ తేదీన టీచర్ విధుల్లో ఉండగా కొంతమంది బాధితులు ఆమెతో గొడవకు దిగారు. ఫైనాన్స్ వ్యవహారం కోర్టులో ఉందని, తనకు సంబంధం లేదని ఆమె వారికి చెప్పేందుకు ప్రయత్నించింది. అయితే బాధితులు మాత్రం అవేవి పట్టించుకోకుండా ఆమెతో వ్యవహరించారు. ఆవుటి బండెప్ప, కోటగిరి రాములుతో పాటు మరికొందరు కలిసి వసంతకుమారిని బలవంతంగా చెట్టుకు కట్టేసి నిర్బంధించారు. అంతటితో ఆగకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ, డబ్బులు ఇవ్వకపోతే ఊరేగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
ప్రాణభయంతో వసంతకుమారి.. ఫైనాన్స్ కేసు తేలకపోతే తన భూమి అమ్మైనా డబ్బులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో గంట తర్వాత ఆమెను వదిలిపెట్టారు.ఈ ఘటన ఈ నెల 7వ తేదిన జరగ్గా, ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా అంగన్వాడీ టీచర్లు అందరు కలిసి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు. వసంత కుమారి పై దాడికి పాల్పడిన వారి పై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also read
- Garuda Purana: కుమారుడు లేకపోతే శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? కుమార్తెకు హక్కు ఉందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఇంటి నుంచి పిలిచి.. వెంటాడి వేటాడారు.. సుహాస్ మృతి కేసులో వెలుగులోకి భయంకర నిజాలు..!
- నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!
- ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్





