దూరపు బంధువుల మధ్య ఆస్తి వివాదం – ఓ వ్యక్తిపై యాసిడ్తో దాడి – పరిస్థితి విషమం- తాడేపల్లి లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్న వైద్యులు
‘రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావూ అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడిస్తాను, భర్యాభర్తల మధ్య చిచ్చు పెడ్తాను, తండ్రీ బిడ్డల్ని విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణస్నేహితుల్ని కూడా విడగొడతాను అందట’. ఇది సినిమా డైలాగే కావచ్చు, కానీ ఇటీవల జరుగుతున్న నేరాలు, వివాదాలు చాలా వరకు డబ్బు, స్థిర, చరాస్తులతో ముడిపడినవే ఉంటున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆస్తి తగాదాల్లో బంధువులపైనే దాడులకు పాల్పడుతున్నారు కొందరు. ఇటువంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది.
యాసిడ్ దాడి: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ శివారు కసుకరు గ్రామానికి చెందిన కోడూరు శ్రీనివాసరావు, మారుపూడి సుబ్బయ్య దూరపు బంధువులు. గత కొన్నాళ్లుగా వీరిమధ్య ఆస్తివివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఇరువురూ ఒకరిపై మరొకరు పొన్నూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు (సోమవారం) సుబ్బయ్య శ్రీనివాసరావుపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాంబాబు, హనీఫ్ అనే మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.
శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అతడ్ని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రీనివాసరావును పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్య సేవల నిమిత్తం అక్కడి నుంచి తాడేపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో గాయపడిన రాంబాబు, హనీఫ్ పొన్నూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు.
మనీ.. మనీ:ఒకప్పుడు డబ్బు కేవలం అవసరంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడది ఆధిపత్యంగా మారిపోయి మానవతా విలువల్ని గుప్పిట్లో పెట్టుకుంది. ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమ, త్యాగం, నమ్మకం, పునాదులుగా బంధాలుండేవి. ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న చిన్న ఆర్థిక కారణాలు గొడవలకు దారి తీస్తుంటే ఆస్తి తగాదాలు హత్యల దాకా వెళ్తున్నాయి.
Also read
- తెల్లారితే నిశ్చితార్థం.. షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే..
- కనిపెంచిన తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని మీరూ కొడుకులేనా.? వీరు ఏం చేశారో తెలిస్తే..!
- అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!
- ఏ కాలంలో ఉన్నాం మనం ఇంకా.. ఎటు పోతుంది సమాజం.. తాగుడు కోసం ఇంత దారుణమా?
- ఆస్తి వివాదం – వ్యక్తిపై యాసిడ్ దాడి – పరిస్థితి విషమం




