తండ్రి తాగుడు ఖర్చుల కోసం బిడ్డను విక్రయించాడు. ఈ హృదయవిదారక ఘటన కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. మైదుకూరు పట్టణం రెవెన్యూ కాలనీలో ఉంటున్న బాల కుమార్ తన రెండు నెలలు బాలుడిని అమ్ముకున్నాడు. తాగుడుకు బానిసై మూడో సంతానమైన రెండు నెలల కుమారుడిని 50 వేల రూపాయలకు విక్రయించాడు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి బిడ్డను సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు.
చాపాడు మండలం సిద్ధారెడ్డి పల్లె ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీనారాయనమ్మ, బాల కుమార్లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. మైదుకూరులో నివాసం ఉంటూ బాల కుమార్ మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీనారాయణమ్మకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా రెండు నెలల క్రితం మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తానని నమ్మించి తల్లి లక్ష్మీనారాయణమ్మను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి బిడ్డని 50 వేల రూపాయలకు విక్రయించినట్లు భార్య చెప్తోంది. బిడ్డ విక్రయంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకారం సైతం ఉన్నట్లు ఆరోపిస్తోంది.
విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ లక్ష్మీనారాయణమ్మను భర్త బెదిరించడంతో భయపడి విషయం బయటకు చెప్పలేదు. తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీనారాయణమ్మ చివరకు బంధువులకు సమాచారం అందించింది. ఈ విషయం అక్కడి నుంచి ICDS అధికారులకు చేరింది. రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ICDS అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. దీంతో బిడ్డను రక్షించిన పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!
- రెచ్చిపోతున్న గంజాయి ముఠా.. అర్థరాత్రి విచ్చలవిడిగా దాడులు!
- గుప్త నిధులు ఉన్నాయంటూ కేటుగాళ్ల దొంగ పూజలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!
- ప్రియుడితో ప్రేమ పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం..
- షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!





