ఎన్నో కష్టాలు పడి.. నవమాసాలు మోసింది.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.. అంతా బాగానే ఉంది.. కూతురికి 5 నెలలు.. ఆలనా పాలనా బాగానే చూసుకుంటోంది.. ఈ క్రమంలోనే.. పాప ఎందుకో ఏడుస్తుంది.. దీంతో ఆమెకు కోపం వచ్చింది.. ఆ పసిపాపను సముదాయించడం మరిచి.. ఆమెపైనే కర్కశంగా ప్రవర్తించింది.. తరచూ ఏడుస్తుందని.. దారుణ నిర్ణయం తీసుకుంది.. ఏడుపు ఆపడం లేదన్న కోపంతో 5 నెలల పసిబిడ్డ నోరు ముక్కు మూసింది.. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. కన్న బిడ్డను చంపిన కసాయి తల్లికి సంబంధించిన ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలం ఎన్ఆర్ అగ్రహరంలో జరిగింది. ఏడుపు ఆపడం లేదన్న కోపంతో 5 నెలల పసిబిడ్డ నోరు ముక్కు మూసిన తల్లి పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అయింది. తల్లి నోరు, ముక్కు మూసేయడంతో ఊపిరాడక పసిబిడ్డ చని పోయింది.
వివరాల ప్రకారం.. ఎన్ఆర్ అగ్రహరంలో నివసిస్తున్న వెంకటేష్, హేమావతికి ఏడేళ్ల క్రితం పెళ్లి జరగింది.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్ల కొడుకుతో పాటు ఐదు నెలల కూతురు కూడా ఉంది. అయితే పెళ్ళైన నాటి నుంచి భార్యా భర్తలు హేమావతి, వెంకటేష్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.
ఈ విషయంపై ఎప్పుడూ కోపంగా ఉండే హైమావతి కన్నబిడ్డ ఏడ్పును భరించలేక పోయింది. ఎప్పుడూ ఏడ్చే బిడ్డ ఏడ్పు ఆపేందుకు ప్రయత్నించిన తల్లి హేమావతి నోటిని ముక్కును చేత్తో గట్టిగా నొక్కి పెట్టింది. దీంతో 5 నెలల పసికందు ఊపిరాడక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.. అనంతరం పోలీసులు హేమవతిని అదుపులోకి తీసుకున్నారు. హేమావతిని విచారించిన పోలీసులు కన్నతల్లే కసాయి గా మారిందని గుర్తించారు.
Also read
- హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఇదే!
- Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..
- Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
- పక్కా స్కెచ్.. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే





