SGSTV NEWS online
Andhra Pradesh

పిజిఆర్ఎస్ ఫిర్యాదులను పరిష్కరించని గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది…

*

అమరావతి:
  గుంటూరు కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది పీజిఆర్ఎస్ కంప్లైంట్ల పై అశ్రద్ధ వహిస్తూ అర్జీదారులను పలు రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది మరియు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వారు చేయాల్సిన పనులను కూడా చేయకుండా ఫిర్యాదుదారులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అని కూడా చూడకుండా, తాము చేయాల్సిన పనులను కూడా చేయకుండా గుంటూరు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఒకరు మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దానిలో భాగంగానే సిరిపురపు స్వరాజ్యలక్ష్మి అనే వృద్ధ మహిళకు చెందిన వ్యవసాయ భూములు చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో కలవు. ఈ భూములు తెనాలి సీనియర్ డివిజన్ కోర్టు ద్వారా వారికి రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ, వారి పేర్లను అడంగుల్లో /మీ భూమి వెబ్ ల్యాండ్ లో ఇతరులు అనే ఆప్షన్ లో నమోదు చేయమని, పట్టాదారు పాస్ పుస్తకం కోసం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ద్వారా అర్జీ పెట్టుకొనగా  చేబ్రోలు తహసిల్దార్ కార్యాలయం వారు వారి విధులు పూర్తిచేసి  ఈ ఫైల్ ను తెనాలి ఆర్ డి ఓ కార్యాలయం కి పంపగా, వారు వారి విధులు పూర్తిచేసి గుంటూరు కలెక్టర్ కార్యాలయంకు పంపగా వారు ఈ 2 PGRS ఫైల్సును పట్టించుకోకుండా పక్కన పడేశారు. దీనిపైన అర్జీదారులు గతంలో పి జి ఆర్ ఎస్ లో రెండు ఫిర్యాదులు చేయగా నేటి వరకు కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, జాయింట్ కార్యాలయ సిబ్బంది ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ సీనియర్ సిటిజన్స్ అయిన అర్జీదారులను అనేకరకాలుగా తిప్పుకొనుచు ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన నేడు సోమవారం 23/3/26న జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీ దారు నేరుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు అర్జిదారు రాత పూర్వక ఫిర్యాదు చేయగా అర్జీ దారు నేరుగా ఉన్నతాధికారులతో మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ని కలెక్టర్ ను కోర్టుకు పిలవడం తప్ప వేరే మార్గం తమకు లేదని, తమ సంబంధిత కార్యాలయాలు చేయవలసిన పనినే చేయకుండా రెండు సంవత్సరాల నుంచి తమని తిప్పుతున్నారని, తాము ఈ విషయంపై జడ్జి గారికి కూడా ఫిర్యాదు చేసినట్లు, జడ్జిగారు గుంటూరు కలెక్టర్ ను, జాయింట్ కలెక్టర్ ను, తెనాలి ఆర్డిఓను కోర్టుకు పిలుద్దామని, తమను దీనిపై కోర్టులో ఒక పిటిషన్ ను వేయమన్నట్లు కూడా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు అర్జీదారు తెలియజేశారు.  కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఈ ఫిర్యాదుపై సంబంధిత సిబ్బందిని పిలిచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ అర్జీదారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఇతరులు అనే ఆప్షన్ లో అర్జీదారి పేరు తక్షణమే నమోదు చేయాలని, పట్టాదారు బాస్ పుస్తకం వచ్చేలాగా చేయాలని లేని పక్షంలో డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులను హెచ్చరించారు.

Also read

Related posts